EPFO : నూతన సంవత్సరానికి ముందు ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు EPFO జీత పరిమితిని పెంచింది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. EPFO (Employees Provident Fund Organisation) పరిమిత పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా లాభం కలగనుంది.
EPF జీత పరిమితిని పెంచాలనేది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్. ఇపుడీ ఈ డిమాండ్‌కు పార్లమెంటులో సమాధానం లభించింది.పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల సమస్యపై చర్చించింది. ముఖ్యంగా EPF జీత పరిమితి పెంచబోతున్నట్టు చెప్పింది.
EPF జీత పరిమితిని పెంపు డిమాండ్‌కు పార్లమెంటులో సమాధానం లభించింది.PF జీత పరిమితిని రూ. 15,000 నుండి రూ. 30,000 కు పెంచాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు, ప్రభుత్వం తరపున కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానం ఇచ్చారు.
EPF జీత పరిమితిని పెంచే నిర్ణయం త్వరలో అమలు చేయబడుతుందని చెప్పింది. ఈ విషయంలో ట్రేడ్ యూనియన్లు, పారిశ్రామిక సంస్థలు వంటి అన్ని సంబంధిత వాటాదారులను సంప్రదించాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
PF జీత పరిమితిని పెంచే విషయాన్ని ప్రభుత్వం తోసిపుచ్చలేదని ఇక్కడ గమనించాలి. బదులుగా, దీనిపై చర్చకు అనుమతించింది.ప్రస్తుతం, ఉద్యోగి బేసిక్ జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో 12% EPF ఖాతాకు జమ చేయబడుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ జమ చేస్తుంది. దీనిలో, ఉద్యోగి మొత్తం వాటా EPFకి వెళుతుంది. కంపెనీ వాటా EPF, EPS, బీమా (EDLI) మధ్య విభజించబడింది. EPF సభ్యుని జీతం పరిమితి ప్రస్తుతం రూ. 15,000. ఈ పరిమితి పెరుగుదల EPS కార్పస్, EPS పెన్షన్, కంపెనీల సహాకారం, పన్ను రహిత దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపులపై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.

