Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP TET 2025 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు.. పూర్తి...

AP TET 2025 : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!!

AP TET 2025 : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET 2025) పరీక్షలు డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్షల షెడ్యూల్‌ వివరాలు :

డిసెంబర్‌ 10 : తెలుగు లాంగ్వేజ్‌ పరీక్ష (రెండు సెషన్లు)

డిసెంబర్‌ 11 : ఇతర భాషలు (ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా మొదలైనవి)

డిసెంబర్‌ 17 : సోషల్‌ స్టడీస్‌

డిసెంబర్‌ 19 : మ్యాథమెటిక్స్‌ & సైన్స్‌ (ఇతర సబ్జెక్టులతో కలిపి)

ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు :

మొదటి సెషన్‌ : ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

రెండో సెషన్‌ : మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

పరీక్షలో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న ఒక మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

దరఖాస్తుల సంఖ్య :

ఈసారి ఏపీ టెట్‌ కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. వీరిలో చాలా మంది పేపర్‌-1తో పాటు పేపర్‌-2కు కూడా అప్లై చేశారు.

కీలు – ఫలితాల షెడ్యూల్‌ :

జనవరి 2, 2026 : ప్రాథమిక కీ విడుదల

జనవరి 2 నుంచి 9 వరకు : అభ్యంతరాలు స్వీకరణ

జనవరి 13 : ఫైనల్‌ కీ ప్రకటన

జనవరి 19 : తుది ఫలితాలు ప్రకటన

టెట్‌లో అర్హత సాధిస్తేనే రాబోయే డీఎస్సీ (DSC) పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు కూడా టెట్‌ అర్హత తప్పనిసరి చేశారు. టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్సీలో వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి అభ్యర్థులు తీవ్ర సన్నద్ధతతో ఉన్నారు.

ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు సిద్ధం :

టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం విద్యాశాఖ ఉచిత ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఈ మాక్‌ టెస్టులు రాయొచ్చు.

RELATED ARTICLES

Most Popular