Tuesday, December 16, 2025
HomeజాతీయంThalapathy Vijay : కరూర్ ఘటన తరువాత.. పుదుచ్చేరిలో విజయ్ మొదటి బహిరంగ సభ..!!

Thalapathy Vijay : కరూర్ ఘటన తరువాత.. పుదుచ్చేరిలో విజయ్ మొదటి బహిరంగ సభ..!!

Thalapathy Vijay : తమిళనాడులో ఇటీవల జరిగిన కరూర్ ఘటన తర్వాత దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం (TVK) పార్టీ తొలి బహిరంగ సభను పుదుచ్చేరిలో నిర్వహించనుంది. రేపు (డిసెంబర్ 10) హార్బర్ గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనుంది.నాలుగు సార్లు రోడ్‌షోకు అనుమతి నిరాకరించిన అధికారులు, బదులుగా స్థిరంగా బహిరంగ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ భద్రతా కారణాలతో కఠిన ఆంక్షలు విధించారు.

ప్రధాన భద్రతా ఏర్పాట్లు :

హాజరు కేవలం 5,000 మందికి మాత్రమే పరిమితం

ప్రత్యేకంగా నిర్మించిన భారీ వేదిక

50 CCTV కెమెరాలతో పూర్తి పర్యవేక్షణ

QR కోడ్ ఆధారిత ఎంట్రీ పాస్ తప్పనిసరి – దీని లేకుండా ఎవరినీ అనుమతించరు

గేట్ల వద్ద బార్‌కోడ్ స్కానింగ్ వ్యవస్థ

జనసమూహం అదుపు తప్పే ప్రమాదం ఉందని, ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారనే ఆందోళన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు తమిళనాడు ప్రజలను ఈ కార్యక్రమానికి రాకూడదని ప్రత్యేకంగా కోరారు. కరూర్‌లో జరిగిన ఘటన తర్వాత విజయ్ అభిమానులు, TVK కార్యకర్తలు ఈ సభను భారీ విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజకీయంగా ఇది దళపతి విజయ్‌కు కీలకమైన మొదటి పెద్ద ప్రదర్శనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular