Tuesday, December 16, 2025
HomeసినిమాPrabhas in Japan : జపాన్‌లో భారీ భూకంపం.. ప్రభాస్‌ సేఫ్ నా..?

Prabhas in Japan : జపాన్‌లో భారీ భూకంపం.. ప్రభాస్‌ సేఫ్ నా..?

Prabhas in Japan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలను కలిపి డిసెంబర్ 12న జపాన్‌లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడి అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు.

అయితే సోమవారం (డిసెంబర్ 8, 2025) సాయంత్రం జపాన్ ఉత్తర తీరంలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఈశాన్య తీరంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో “మా డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు?”, “ఈరోజు రిటర్న్ అవుతాడా?” అంటూ పోస్టులు పెట్టారు.

ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తూ “జపాన్‌లో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు సార్?” అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన డైరెక్టర్ మారుతి.. “ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి” అని స్పష్టమైన రిప్లై ఇచ్చారు.మారుతి ఈ గుడ్ న్యూస్ ఇవ్వడంగానే ప్రభాస్ అభిమానులు భారీగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవలే బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్న ప్రభాస్ జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయ్యారు. “గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నా. రాజమౌళి గారు, శోబు గారు ఎప్పుడూ జపాన్ ప్రేక్షకుల గురించి చెబుతూనే ఉంటారు. ఇప్పుడు నేనే చూశాను. జపాన్ మా అందరికీ సొంత దేశంలా మారిపోయింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని ఎమోషనల్‌గా మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular