Tuesday, December 16, 2025
HomeసినిమాAkhanda-2 new release date : "అఖండ-2" సినిమా విడుదలకు లైన్ క్లియర్.. కొత్త రిలీజ్...

Akhanda-2 new release date : “అఖండ-2” సినిమా విడుదలకు లైన్ క్లియర్.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడుంటే..?

Akhanda-2 new release date : తెలుగు సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ-2: తాండవం’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగాయి. డిసెంబర్ 5న జరిగిన ఆలస్యానికి కారణమైన మద్రాసు హైకోర్టు స్టే ఆర్డర్ ఇప్పుడు ఎత్తివేసింది. దీంతో సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్తతో బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందానికి అవధులు రాస్తున్నారు.

కోర్టు వివాదం :

‘అఖండ-2’ మూవీ విడుదలకు కేవలం గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, డిసెంబర్ 4న మద్రాసు హైకోర్టు ఒక షాకింగ్ ఆర్డర్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ LLPపై దాఖలు చేసిన పిటిషన్‌లో రూ. 28 కోట్లకు పైగా ఆర్బిట్రేషన్ బకాయిలు ఉన్నాయని వాదించింది. ఈరోస్ ప్రకారం, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (అదే గ్రూప్ కంపెనీ) 2014 నుంచి ఈ మొత్తాన్ని చెల్లించలేదు. ఈ విషయంపై 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా, 14 రీల్స్ సంస్థలు మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సవాలు చేసి చెల్లింపు నివారించాయి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ LLP ద్వారా ‘అఖండ-2’ విడుదల చేయడం ద్వారా బకాయిలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈరోస్ ఆరోపించింది.

జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ సి. కుమారప్పన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను పరిశీలించి, సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలపై మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) ఇచ్చింది. దీంతో ప్రీమియర్ షోలు, విడుదల స్థాగితం అయ్యాయి. నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ “తప్పనిసరి పరిస్థితుల వల్ల వాయిదా” అని ప్రకటించి, అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

కానీ, డిసెంబర్ 9న జరిగిన తాజా విచారణలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వైపులా వాదనలు విన్న బెంచ్, బకాయిలు చెల్లించేందుకు నిర్మాతలు చూపిన ఆసక్తిని గమనించి, విడుదలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అధికారిక ప్రకటనకు కేవలం గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular