Tuesday, December 16, 2025
HomeజాతీయంSpecial Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు...

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..!!

Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా జనవరి నెలాఖరు నుంచి భారీగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఉద్యోగ-వ్యాపారాలు చేసుకుంటూ సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం చర్లపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.

రైలు వివరాలు :

ట్రైన్ నం. 07196 → చర్లపల్లి నుంచి కాకినాడ

తేదీలు: డిసెంబర్ 24, 25, 30 (మంగళ, బుధవారాలు)
బయలుదేరే సమయం: సాయంత్రం 7:30 గంటలు
కాకినాడ చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు

ట్రైన్ నం. 07195 → కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లి

తేదీలు: డిసెంబర్ 28, 31 (ఆది, బుధవారాలు)
బయలుదేరే సమయం: సాయంత్రం 7:30 గంటలు
చర్లపల్లి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు

మార్గమధ్యంలో ఆగే స్టేషన్లు:

నల్గొండ → మిర్యాలగూడ → పిడుగురాళ్ల → సత్తెనపల్లి → గుంటూరు → విజయవాడ → గుడివాడ → కైకలూరు → ఆకివీడు → భీమవరం టౌన్ → తణుకు → రాజమండ్రి → సామల్‌కోట్ → కాకినాడ

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాలను కలుపుతూ డిసెంబర్ 24 నుంచి 31 వరకు నడుస్తాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.

టికెట్ బుకింగ్ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. IRCTC వెబ్‌సైట్ లేదా రైల్వే కౌంటర్ల ద్వారా ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. ఈ రైళ్లు సాధారణ స్పెషల్ ఛార్జీలతోనే నడుస్తాయి.

RELATED ARTICLES

Most Popular