The Raja Saab Movie Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్-కామెడీ-ఫ్యాంటసీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్‌లు పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథ సారాంశం : రాజాసాబ్ (ప్రభాస్) తన నానమ్మ గంగాదేవి (జరీనా వహాబ్)తో సాధారణ జీవితం గడుపుతాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తాతవారి పురాతన భవనాన్ని అమ్మాలనుకుంటాడు. కానీ ఆ భవనంలో దాగి ఉన్న అతీత రహస్యాలు, ఆత్మలు అతని జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఇందులో రొమాన్స్ (నిధి అగర్వాల్, మాళవిక మోహనన్), హారర్, కామెడీ మిక్స్ అయి సాగుతుంది. సంజయ్ దత్ విలన్ రోల్‌లో కీ పాత్ర పోషిస్తాడు.
పాజిటివ్స్:
ప్రభాస్ పర్ఫార్మెన్స్: చాలాకాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ బ్యాక్! కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్, పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ (ముఖ్యంగా ఆస్పత్రి సీన్)లో అదరగొట్టాడు. ఫ్యాన్స్‌కు పూర్తి ఫీస్ట్.
కామెడీ & ఎంటర్‌టైన్‌మెంట్ : ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్, ఫన్ ఫిల్. నానమ్మ-మనవడు సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. రొమాన్స్ ట్రాక్ ఎంటర్‌టైనింగ్.
తమన్ బీజీఎం & సాంగ్స్ : నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు బాగున్నాయి, క్లైమాక్స్‌లో ఎలివేషన్ ఇస్తాయి.
క్లైమాక్స్ : లాస్ట్ 30-40 నిమిషాలు పవర్‌ప్యాక్డ్, ఎమోషనల్. ప్రభాస్-సంజయ్ దత్ ఫేస్-ఆఫ్ హైలైట్. కొత్తగా ట్రై చేసిన ఎండింగ్ ఆకట్టుకుంటుంది.
ప్రొడక్షన్ వాల్యూస్ : రిచ్ లుక్, గ్రాండ్ సెట్స్, VFX (కొన్ని చోట్ల హాలీవుడ్ స్టాండ)
నెగెటివ్స్ :
స్క్రీన్‌ప్లే లోపాలు: సెకండ్ హాఫ్‌లో కొన్ని డల్ మూమెంట్స్, గందరగోళం. హారర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్నాయి, భయపెట్టలేదు.
నిడివి : 3 గంటల 9 నిమిషాలు – అనవసర సీన్స్ ఎడిట్ చేస్తే బెటర్ అయ్యేది.
VFX & కన్సిస్టెన్సీ : కొన్ని VFX షాట్స్ పూర్, స్టోరీలో కన్‌ఫ్యూజన్ ఫీల్.
సాంకేతికం : సినిమాటోగ్రఫీ రిచ్, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణం గ్రాండ్.
ఫైనల్ వర్డిక్ట్ : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పైసా వసూల్ ఎంటర్‌టైనర్. జనరల్ ఆడియెన్స్‌కు మిక్స్‌డ్ – ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుని చూస్తే ఎంజాయ్ చేయవచ్చు. థియేటర్‌లో ప్రభాస్ మాస్‌ను ఫీల్ అవ్వాలంటే తప్పక చూడండి!

