Tuesday, December 16, 2025
HomeసినిమాHari Hara VeeraMallu Movie : ''హరిహర వీరమల్లు'' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.....

Hari Hara VeeraMallu Movie : ”హరిహర వీరమల్లు” మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

Hari Hara VeeraMallu Movie : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జులై 24న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడులో పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

అయితే ఇటీవల VFX పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల కొంత వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ తాజాగా ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ను జులై 3న ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular