Tuesday, December 16, 2025
HomeతెలంగాణSuryapet District : అతనికి 25 ఏళ్ళు.. ఆమెకు 35 ఏళ్ళు

Suryapet District : అతనికి 25 ఏళ్ళు.. ఆమెకు 35 ఏళ్ళు

Suryapet District : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బోడల దిన్న గ్రామానికి చెందిన అశ్విని (35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అశ్విని తన భర్త శ్రీనివాస్ రెడ్డి మరియు కూతురుతో కలిసి ఎల్బీనగర్‌లో నివసిస్తోంది.
అదే గ్రామానికి చెందిన కందుకూరు సురేష్ రెడ్డి (25) అనే యువకుడితో అశ్విని వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు రావడంతో సురేష్ రెడ్డి అశ్వినిని దూరం పెట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన అశ్విని, సురేష్ రెడ్డికి వీడియో కాల్ చేసి, “నీవు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను” అని బెదిరించింది. అయినప్పటికీ, సురేష్ రెడ్డి “నేను రాను” అని సమాధానం ఇవ్వడంతో, అశ్విని వీడియో కాల్‌లో చూపిస్తూ ఉరేసుకుంది.
ఈ ఘటన తెలుసుకున్న సురేష్ రెడ్డి వెంటనే అశ్విని ఇంటికి చేరుకుని, ఆమెను కొన ఊపిరితో ఉన్న స్థితిలో సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అశ్విని పరిస్థితి విషమించడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ, ఆమె జూన్ 29న రాత్రి మృతి చెందింది. అశ్విని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో సురేష్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular