Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్Russia : రష్యాలో భారీ భూకంపం.. వీడియో వైరల్..!!

Russia : రష్యాలో భారీ భూకంపం.. వీడియో వైరల్..!!

Russia : రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో జులై 30న రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి కేవలం 19 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యా, జపాన్, హవాయి, అలస్కా, గ్వామ్ తదితర ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) అలర్ట్‌లు జారీ చేసింది. అమెరికా వాతావరణ శాఖ 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

రష్యా తూర్పు తీరంలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 144 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం యొక్క తీవ్రత కారణంగా స్థానికంగా తీవ్ర విధ్వంసం సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెవెరో-కురిల్స్క్ ప్రాంతంలో ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో కూడా తీరప్రాంత రైలు సర్వీసులను నిలిపివేసి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో రష్యా, జపాన్‌తో పాటు అమెరికా పశ్చిమ తీరం, హవాయి, అలస్కా ఆలూషియన్ దీవులకు కూడా అలర్ట్‌లు విస్తరించాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, 300 కిలోమీటర్ల తీరప్రాంత పరిధిలో సునామీ అలలు తాకిడి చేసే అవకాశం ఉందని తెలిపారు. జపాన్ వాతావరణ శాఖ 3 మీటర్ల ఎత్తులో అలలు రావచ్చని హెచ్చరించింది, దీంతో తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular