One Rupee Visa Offer : ప్రయాణాలు ఇష్టపడే భారతీయులకు అట్లీస్ (Atlys) సంస్థ ఒక శుభవార్త చెప్పింది. టెక్నాలజీ ఆధారిత వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్, ‘అట్లీస్ వన్ వే అవుట్’ పేరుతో నిర్వహించే బంపరాఫర్‌లో కేవలం ఒక్క రూపాయికి 15కి పైగా దేశాలకు వీసా అందిస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతర్, కెన్యా, తైవాన్ వంటి దేశాలకు వీసా కోసం అట్లీస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ ఉన్నవారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు, కానీ కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు ప్రాసెసింగ్ కేంద్రంలో చెల్లించాలి.ఈ ఆఫర్ ఆగస్టు 4 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5 రాత్రి 12 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసిన వెంటనే ఈ ఆఫర్ స్వయంచాలకంగా వర్తిస్తుంది, కానీ ఎంబసీల నిబంధనలను కచ్చితంగా పాటించాలి, లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్‌ను ట్రావెల్ లవర్స్ సద్వినియోగం చేసుకోవాలని అట్లీస్ సంస్థ కోరుతోంది.
One Rupee Visa Offer : స్పెషల్ ఆఫర్.. ఒక్క రూపాయికే వీసా.. ఈ 15 దేశాలకు ఫ్రీగా ప్రయాణం చేశాయండి..!
By bharath9news
RELATED ARTICLES

