Central Government Jobs : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం లభించింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (GAIL)లో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో చీఫ్ మేనేజర్ – 1, సీనియర్ ఆఫీసర్ – 5, సీనియర్ ఇంజనీర్ – 8, ఆఫీసర్ – 1, దివ్యాంగుల కేటగిరీ – 14 ఖాళీలు ఉన్నాయి. లీగల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్, మెడికల్ సర్వీసెస్, లాంగ్వేజ్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, మంచి సాలరీతో కేంద్ర ప్రభుత్వ రంగంలో లైఫ్ సెట్ చేసుకోవచ్చు.
అర్హతల విషయానికొస్తే, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు తప్పనిసరి. ఎంబిఏ, సీఏ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ వంటివి పోస్టును బట్టి మారతాయి. కనీసం 1 సంవత్సరం అనుభవం అవసరం, చీఫ్ మేనేజర్‌కు 12 ఏళ్లు కావాలి. వయోపరిమితి: సీనియర్ మేనేజర్ – 46 ఏళ్లు, సీనియర్ ఆఫీసర్ – 33 ఏళ్లు, సీనియర్ ఇంజనీర్ – 38 ఏళ్లు, మెడికల్ సీనియర్ ఆఫీసర్ – 42 ఏళ్లు. ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్‌కు సడలింపు ఉండటంతో గరిష్ఠంగా 56 ఏళ్ల వరకు అర్హులు.
ఎంపిక విధానం విభాగాన్ని బట్టి మారుతుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ వంటివి ఉంటాయి. కొన్ని పోస్టులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా రాతపరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో gailonline.com వెబ్‌సైట్ ద్వారా చేయాలి. ఫీజు రూ.200 (SC/ST/దివ్యాంగులకు మినహాయింపు). దరఖాస్తులు నవంబర్ 24, 2025 నుంచి మొదలై, డిసెంబర్ 23, 2025 వరకు స్వీకరిస్తారు. సాలరీ: చీఫ్ మేనేజర్ – రూ.90,000 నుంచి రూ.2,40,000; సీనియర్ ఇంజనీర్/ఆఫీసర్ – రూ.60,000 నుంచి రూ.1,80,000; ఆఫీసర్ – రూ.50,000 నుంచి రూ.1,50,000. అదనంగా అలవెన్సులు, బెనిఫిట్స్ ఉంటాయి.

