Holidays : కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ కొత్త క్యాలెండర్లో మొత్తం 14 తప్పనిసరి (గెజిటెడ్) సెలవులు, 12 ఐచ్ఛిక సెలవులు ఉంటాయి. ప్రస్తుత 2025 సంవత్సరంతో పోల్చితే వచ్చే ఏడాది సెలవుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జనవరి 1 నూతన సంవత్సరం, 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి వంటి జాతీయ సెలవులతో పాటు సంక్రాంతి, ఉగాది, హోలీ, రంజాన్, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, బక్రీద్, దసరా (18,19,20 అక్టోబర్), దీపావళి (నవంబర్ 8), క్రిస్మస్ (డిసెంబర్ 25) తదితర ముఖ్యమైన పండుగలకు కూడా సెలవులు ప్రకటించారు.
ఈ సెలవులతో పాటు 52 ఆదివారాలు, 12 రెండవ శనివారాలు కూడా లభించనుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు ముందుగా టూర్లు, కుటుంబ కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు అధికంగా లభించడం, మొత్తంగా సంవత్సరానికి సుమారు 100 రోజులకు పైగా సెలవులు రావడం ఈ ఏడాది కీలక అంశంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు, ఉద్యోగులు ఈ కొత్త క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకొని 2026 ప్లానింగ్ చేసుకోవచ్చు.

