AP TET : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ – అక్టోబర్ సెషన్ 2025) కోసం ఆన్‌లైన్ మాక్ టెస్టులను ప్రారంభించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఉచితంగా ఈ మాక్ టెస్టులు రాయవచ్చు. ఇందుకోసం https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, హోంపేజీలోని ‘మాక్ టెస్ట్’ ఆప్షన్ పై క్లిక్ చేసి, తాము అప్లై చేసిన సబ్జెక్టు లింక్‌ను ఎంచుకోవాలి. ఎలాంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండానే సైన్-ఇన్ అయి పరీక్ష రాయవచ్చు. ఈ మాక్ టెస్టుల ద్వారా అసలు పరీక్ష విధానం, సమయ నిర్వహణపై అవగాహన పెంచుకోవచ్చు.
ఏపీ టెట్ పరీక్షలు 2025 డిసెంబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు – మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించగా, నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
ఫలితాల షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న, ఫైనల్ ఆన్సర్ కీ జనవరి 13న, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేస్తారు. ఏదైనా సందేహాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ హెల్ప్‌డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160లకు సంప్రదించవచ్చు.

