Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్WhatsApp : వాట్సాప్, టెలిగ్రామ్‌ యూజర్లకు బిగ్ షాక్.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే..?

WhatsApp : వాట్సాప్, టెలిగ్రామ్‌ యూజర్లకు బిగ్ షాక్.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే..?

WhatsApp : భారత ప్రభుత్వం సైబర్ మోసాలను అరికట్టేందుకు కీలక నిబంధనలు తీసుకొచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయకూడదని “టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025” ద్వారా ఆదేశించింది. యూజర్ ఫోన్‌లో యాక్టివ్ సిమ్ ఉండాలి, దానితో యాప్ నిరంతరం అనుసంధానంలో ఉండాలి. ఈ నియమాలను అమలు చేయడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు.

వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయిన యూజర్లను ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలి, మళ్లీ మొబైల్‌లో QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లాగిన్ అనుమతించాలి. ఇప్పటివరకు ఒకసారి నంబర్ వెరిఫై చేస్తే సిమ్ తీసేసినా యాప్ పనిచేసేది. ఈ లొసుగును వినియోగించుకుని విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని, సిమ్ బైండింగ్ ద్వారా నేరస్థులను గుర్తించడం సులువవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

అయితే ఈ నిబంధనపై నిపుణుల్లో మిశ్రమ స్పందన ఉంది. మోసాలు కొంత తగ్గే అవకాశం ఉందని కొందరు అంటుంటే, నకిలీ ఐడీలతో కొత్త సిమ్‌లు సులుభంగా తెచ్చుకోవచ్చని, కాబట్టి ఈ చర్య ప్రయోజనం పరిమితమే అని మరికొందరు వాదిస్తున్నారు. సాధారణ యూజర్లకు తరచూ లాగిన్, ధ్రువీకరణ ఇబ్బందులు ఎదుర్కావాల్సి వస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular