Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Sanchar Saathi App : కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మొబైల్స్‌లో ఈ యాప్ తప్పనిసరి.....

Sanchar Saathi App : కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మొబైల్స్‌లో ఈ యాప్ తప్పనిసరి.. ఎందుకంటే..?

Sanchar Saathi App : కేంద్ర ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మొబైల్ దొంగతనాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ యాప్‌ను వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయలేరు (అన్‌ఇన్‌స్టాల్ సాధ్యం కాదు).

‘సంచార్ సాథీ’ పోర్టల్ & యాప్‌ను ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించిన కేంద్రం ఇప్పటివరకు దీని సాయంతో సుమారు 7 లక్షల చోరీ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేసింది. ఈ యాప్ ద్వారా పోగొట్టుకున్న/దొంగిలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు, IMEI ట్యాంపరింగ్‌ను నిరోధించవచ్చు, సైబర్ మోసాలకు సంబంధించి రియల్ టైమ్ అలర్ట్స్ ఇస్తుంది మరియు అనధికారిక యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది.

2025 డిసెంబర్ 1 నుంచి తయారయ్యే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్ డిఫాల్ట్‌గా ఉండాలి. పాత ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను అమలు చేయడానికి మొబైల్ కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చారు. అయితే యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు థర్డ్-పార్టీ యాప్‌ను బలవంతంగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయడాన్ని గతంలోనూ వ్యతిరేకించాయి కాబట్టి వీరి స్పందన ఆసక్తికరంగా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ చర్య వల్ల సైబర్ నేరాలు 20-30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular