Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Constable Jobs : పదో తరగతి అర్హతతో 25,487 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల లింక్...

Constable Jobs : పదో తరగతి అర్హతతో 25,487 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుల లింక్ ఇదే..!!

Constable Jobs : కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPFs), SSF, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మరియు రైఫిల్‌మన్ (GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 25,487 ఖాళీలను భర్తీ చేయనుంది.

అర్హతలు :

విద్యార్హత : 10వ తరగతి (మెట్రిక్) ఉత్తీర్ణత
వయసు : 01 జనవరి 2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి (అంటే 02.01.2003 నుంచి 01.01.2008 మధ్య జన్మించిన వారు) రిజర్వేషన్ నియమాల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు వివరాలు :

దరఖాస్తు ప్రారంభం : 01 డిసెంబర్ 2025 (ఇప్పటికే ప్రారంభమైంది)
చివరి తేదీ : 31 డిసెంబర్ 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ : 01 జనవరి 2026
అప్లికేషన్ సవరణ విండో : 08–10 జనవరి 2026
దరఖాస్తు రుసుము : ₹100 (మహిళలు, SC, ST, మాజీ సైనికులకు మినహాయింపు)

ఎంపిక ప్రక్రియ :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) – ఆన్‌లైన్‌లో
శారీరక సామర్థ్య పరీక్ష (PET) & శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
వైద్య పరీక్ష (DME/RME)
డాక్యుమెంట్ వెరిఫికేషన్

CBT పరీక్షలు : ఫిబ్రవరి–మార్చి 2026లో (తుది తేదీలు త్వరలో ప్రకటిస్తారు)

అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular