Samantha – Naga Chaitanya : టాలీవుడ్ హీరో నాగ చైతన్య, సమంతల మధ్య ఒకప్పుడు ఎంతో ప్రేమ ఉండేది. 2017లో పెళ్లి చేసుకుని, 2021లో అభిప్రాయాల విభేదాల వల్ల విడాకులు తీర్చుకున్నారు. ఆ తర్వాత చైతన్య 2024 డిసెంబర్ 4న శోభిత ధులిపాలను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించుకుని, నిన్న (డిసెంబర్ 1) కోయింబత్తూర్లోని ఈశా యోగా సెంటర్లోని లింగ భైరవి దేవాలయంలో దర్శకుడు రాజ్ నిదిమోరు (రాజ్ & డీకే డ్యూవల్లో ఒకరు)ని పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ సమయంలో చైతన్య పోస్ట్ కూడా అదే రోజు వైరల్ అవ్వడంతో నెటిజన్లలో సందేహాలు మొదలయ్యాయి.
సమంత పెళ్లి రోజు అయిన నిన్నే చైతన్య తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిలో తన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ (Dhootha) రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన భావోద్వేగ భావనలు వ్యక్తం చేశారు. “ఒక నటుడిగా మంచి కథను ఎంచుకుని, నిజాయితీతో, సృజనాత్మకంగా పని చేస్తే.. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు. వారు ఆ ఎనర్జీని మళ్లీ మనకు తిరిగి ఇస్తారు. ‘దూత’ నాకు అలాంటి అనుభవం ఇచ్చింది. ఈ సిరీస్ చూసిన ఆడియన్స్ నుంచి వచ్చిన ఎనర్జీ మాకు పెద్ద శక్తి. అదే ఎనర్జీని మేము మా పనితో తిరిగి ప్రేక్షకులకు అందిస్తాం. ‘దూత’కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఇందులో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!” అంటూ ఆయన రాశారు. చైతన్య పోస్ట్ వైరల్ అవ్వడంతో, నెటిజన్లలో చర్చలు మొదలయ్యాయి. “సమంత పెళ్లి రోజు ఇలాంటి ‘నిజాయితీ’ గురించి పోస్ట్.. ఏమిటీ కోయిన్సిడెన్స్?” అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు.

