Tuesday, December 16, 2025
HomeజాతీయంRupee Value : డాలర్ దెబ్బ.. చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి..!!

Rupee Value : డాలర్ దెబ్బ.. చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి..!!

Rupee Value : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే ఏకంగా 90 మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం సెషన్‌లో 89.96 వద్ద ముగిసిన రూపాయి విలువ (Rupee Value).. నేటి ఆరంభం నుంచే క్షీణిస్తూ వస్తోంది. ఒక దశలో ఏకంగా 90.14 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల ప్రాంతంలో 90.12 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

దిగుమతిదార్ల నుంచి డాలరుకు (Dollar Rupee Value) అధిక గిరాకీ, షార్ట్‌కవరింగ్‌ కొనసాగడం లాంటివి రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. రూపాయి విలువ 91కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నాయి.

మరోవైపు దేశీయ మార్కెట్లు కూడా బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 241 పాయింట్లు దిగజారి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 25,928 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. నేటి నుంచి ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 5న వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకు ప్రకటన చేయనుంది. కీలక వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కోత పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular