Tuesday, December 16, 2025
Homeస్పోర్ట్స్India vs South Africa : టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?

India vs South Africa : టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?

India vs South Africa : మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించడంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని దక్షిణాఫ్రికా గట్టి ప్రయత్నం చేస్తోంది. మొదటి వన్డేలో 48 రన్స్ తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సఫారీ జట్టు మూడు కీలక మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ టెంబా బవుమా, స్పిన్నర్ కేశవ్ మహారాజ్, ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి తిరిగి జట్టులో చేరారు. వీరి స్థానంలో రియాన్ రికెల్టన్, త్రిస్టన్ సుబ్రాయెన్, ఒట్నీల్ బార్ట్‌మాన్‌లను పక్కన పెట్టారు.

టీమిండియా జట్టులో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు.

దక్షిణాఫ్రికా జట్టులో ఐడెన్ మార్‌క్రమ్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో య‌న్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular