Andhra King Taluka Movie Review : రామ్ పోతినేని హీరోగా, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు P దర్శకత్వంలో వస్తోన్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 27న రిలీజ్ అయింది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ పాటలన్నీ చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచాయి.
కథ : ఈ సినిమాలో సాగర్ (రామ్ పోతినేని) అత్యంత వీరాభిమానిగా ఉండే స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) కోసం ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం. కాలేజీ గొడవలు, టికెట్ల కోసం పడిగాపులు, ఇంటి బాధ్యతలు కూడా మర్చిపోతాడు. ఒక రోజు థియేటర్ యజమానితో గొడవ పడ్డాక, తన ఊరికి వచ్చిన పెను సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ తన అభిమాన హీరోనే నేరుగా వచ్చి సాయం చేస్తాడు. ఆ హీరో ఎందుకు కదిలొచ్చాడు? అసలు వెనుకాల రహస్యం ఏమిటి? అనేదే మిగతా కథ.
రామ్ పోతినేని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాక్లెట్ బాయ్ లుక్‌తో మళ్లీ అదరగొట్టాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందంతో పాటు కెమిస్ట్రీలో ఆకట్టుకుంది. ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి నటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వివేక్-మెర్విన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్ద ప్లస్.
మొత్తంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నేటి వెర్రి ఫ్యాన్స్‌ను ఆలోచింపజేసే ఎమోషనల్ ఎంటర్‌టైనర్. రామ్‌కి గట్టి కమ్‌బ్యాక్‌గా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
1.రామ్ పోతినేని కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ & చాక్లెట్ బాయ్ లుక్ రీఎంట్రీ
2.వివేక్-మెర్విన్ ఫ్రెష్ మ్యూజిక్ & సూపర్బ్ BGM
3.రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ, ఉపేంద్ర సెటిల్డ్ పర్ఫార్మెన్స్
4.నేటి ఫ్యాన్ కల్చర్‌పై రిలేటబుల్ డైలాగ్స్ & ఎమోషనల్ కనెక్ట్
5.రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, క్లీన్ సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
1.కొంతమందికి లెంగ్త్ ఎక్కువగా అనిపించే అవకాశం
1.సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు స్లో అనిపించవచ్చు
రేటింగ్ : 3.25/5

