Saturday, January 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Annadata Sukhibhava scheme latest news : అన్నదాత సుఖీభవ బిగ్ అప్డేట్.. మూడో ఇన్‌స్టాల్‌మెంట్...

Annadata Sukhibhava scheme latest news : అన్నదాత సుఖీభవ బిగ్ అప్డేట్.. మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే

Annadata Sukhibhava scheme latest news : ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్! అన్నదాత సుఖీభవ పథకం మూడో విడతలో రూ.6000 (రాష్ట్రం రూ.4000 + పీఎం కిసాన్ రూ.2000) ఫిబ్రవరి 2026లో ఖాతాల్లో జమ కానుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లా కొడుమూరులో ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో రూ.7000 చొప్పున జమ అయిన నేపథ్యంలో రైతులు ఈ మూడో విడతకు ఎదురుచూస్తున్నారు.

కడపా-కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి సాగు నష్టపోయిన 37 వేల మంది రైతులకు హెక్టారుకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేసిన మంత్రి అచ్చెన్నాయుడు, అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి రూ.20,000 (రాష్ట్రం రూ.14,000 + కేంద్రం రూ.6,000) మూడు విడతల్లో అందిస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో రూ.5000 + రూ.2000, రెండో విడతలో మళ్లీ రూ.7000, మూడో విడతలో రూ.4000 + రూ.2000 జమ అవుతాయి.

రైతులు అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ annadathasukhibhava.ap.gov.in (లేదా annadatasukhibhava.ap.gov.in)లో ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. eKYC పూర్తి చేసి, బ్యాంకు వివరాలు సరిచూసుకుంటే డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా పడతాయి. సమస్యలు ఉంటే సమీప రైతు సేవా కేంద్రం లేదా గ్రామ/వార్డు సచివాలయంలో పరిష్కరించుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular