Monday, December 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP New Districts and Mandals : ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు.. పూర్తి...

AP New Districts and Mandals : ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు.. పూర్తి వివరాలు ఇవే..!

AP New Districts and Mandals : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం, రాష్ట్రంలో నూతనంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

కొత్త జిల్లాలు

1.మార్కాపురం
2. మదనపల్లి
3. పోలవరం జిల్లా (జిల్లా కేంద్రం రంపచోడవరం).

    అదనంగా, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది – అనకాపల్లిలో నక్కపల్లి, ప్రకాశంలో అద్దంకి, కొత్త మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాలలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర. మండలాల స్థాయిలో కర్నూలు జిల్లాలో పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయనుండగా, ఆదోని మండలాన్ని విభజించి మరో కొత్త మండలం సృష్టించే ప్రతిపాదనకు కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular