dhurandhar movie 4 day collections : ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘దురంధర్’ థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తోంది. తొలి వీకెండ్‌లోనే ఇండియాలో రూ.103 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, నాలుగు రోజుల్లో రూ.123.91 కోట్లను ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును దాటేసింది.
తొలి సోమవారం (డిసెంబర్ 8)ను కూడా దురంధర్ అద్భుతంగా దాటేసింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం ఉదయం 13%, మధ్యాహ్నం 26% పైగా, సాయంత్రం 37.71% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ రోజు ఇండియాలో సుమారు రూ.20.91 కోట్ల నెట్ వసూలు చేసినట్లు అంచనా. శుక్రవారం స్థాయిలోనే ఆదివారం కలెక్షన్లు రావడం ఈ చిత్రం ఒప్పును చాటుతోంది.
నాలుగు రోజుల్లోనే దురంధర్, సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ జీవితకాల కలెక్షన్ (రూ.109.83 కోట్లు)ను అధిగమించింది. నోటి మాట బలంతో మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ బోక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ చిత్రం జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం.

