DRDO Recruitment : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో రక్షణ పరిశోధన రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (CEPTAM) 11 నియామక ప్రకటన చాలా మందికి కొత్త ఆశ తీసుకొచ్చింది. CEPTAM 11 కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి ఎస్‌టిఎ-బి, టెక్నీషియన్-ఎ టెక్-ఎ పోస్టులకు మొత్తం 764 ఖాళీలు ప్రకటించింది.
ఆన్లైన్ అప్లికేషన్ 9 డిసెంబర్ 2025న ప్రారంభం అవుతుంది. అప్లై చేయాలనుకునే వారు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. పూర్తి నోటిఫికేషన్ త్వరలో డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్లో వస్తుంది. విడుదలైన తర్వాత అన్ని షరతులు ఖచ్చితంగా అనుసరించాలి. డీఆర్డీఓ సిఇపిటామ్ 11 రిక్రూట్మెంట్ 2025లో ఎస్‌టిఎ-బి, టెక్-ఎ పోస్టులు మొత్తం 764 ఉన్నాయి. ఇందులో 561 ఎస్‌టిఎ-బి, 203 టెక్నీషియన్-ఎ పోస్టులు ఉన్నాయి. సంస్థ, ఖాళీలు, అప్లికేషన్ విధానం, ఎంపిక దశలు, జీతం వంటి ప్రధాన వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉన్నాయి.
ఎస్‌టిఎ-బి పోస్టుకు బిఎస్సీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ డిప్లమా అవసరం. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బోటనీ, జూలజీ, సైకాలజీ, అగ్రికల్చర్, టెక్స్టైల్, లైబ్రరీ సైన్స్, ఫోటోగ్రఫీ, ప్రింటింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో డిగ్రీ, డిప్లోమా ఉండాలి. టెక్నీషియన్-ఎ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎన్‌టిసి, ఎన్ఎస్ అవసరం.
ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, కార్పెంటర్, బుక్ బైండర్, సిఎన్సి ఆపరేటర్, కోపా, డ్రాఫ్ట్స్మాన్ మెకానికల్, డిటిపి ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్, పెయింటర్, ఫోటోగ్రాఫర్, రిఫ్రిజరేషన్ ఎసి, షీట్ మెటల్ వర్కర్ వంటి ట్రేడ్లు అంగీకరించబడతాయి. వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు డీఆర్డీఓ వెబ్సైట్లో వేకెన్సీస్ CEPTAM సెక్షన్ ద్వారా అప్లై చేయాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసి, తర్వాత లాగిన్ అయి పర్సనల్, అకాడమిక్ పోస్టు వివరాలు నమోదు చేయాలి. ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్లు, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపిఐ ద్వారా ఫీజు చెల్లించాలి. ఫామ్‌ను పూర్తిగా చెక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. ఫీజు విషయంలో జనరల్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి, ఈఎస్ఎమ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
జీతం వివరాలు చూస్తే ఎస్‌టిఎ-బి లెవల్ 6 పే స్కేల్ రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. టెక్-ఎ పోస్టుకు లెవల్ 2 పే స్కేల్ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. అలవెన్సులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుతాయి. ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. టైర్ 1 CBT స్క్రీనింగ్ టెస్ట్. టైర్ 2 CBT లేదా స్కిల్ ట్రేడ్ టెస్ట్, అప్లై చేసిన పోస్టు ఆధారంగా ఉంటుంది. టైర్ 1 లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, రీజనింగ్ సెక్షన్లు ఉంటాయి.

