Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్GAS Cylinder Prices : సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలివే..!!

GAS Cylinder Prices : సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలివే..!!

GAS Cylinder Prices : ప్రతి నెలా 1వ తేదీన భారత్‌లోని ప్రధాన చమురు కంపెనీలు (IOC, BPCL, HPCL) ఎల్‌పీజీ ధరలను సమీక్షిస్తాయి. ఈసారి డిసెంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ.10 తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడు ధర రూ.1,580.50కి చేరింది (గతంలో రూ.1,590.50). ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ యూనిట్లు వంటి చిన్న వ్యాపారులకు గణనీయమైన ఉపశమనం కలిగించింది.

14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఢిల్లీలో రూ.853, కోల్‌కతా, ముంబై, చెన్నైలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఏప్రిల్ 8, 2025 నుంచి ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. PM ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీ ద్వారా లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే అందుతోంది. దీంతో కుటుంబాల బడ్జెట్‌పై ఎటువంటి ఒత్తిడీ లేకుండా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే ఈ తగ్గింపుకు ముఖ్య కారణం. గత ఆరు నెలల్లో కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు మొత్తం రూ.223 వరకు పడిపోయాయి. క్రూడ్ ధరలు ఇలాగే స్థిరంగా తగ్గుతూ వస్తే, రాబోయే నెలల్లోనూ మరింత తగ్గింపు అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular