Tuesday, December 16, 2025
HomeజాతీయంGoa : గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

Goa : గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

Goa : పర్యాటక రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన గోవాలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం మొత్తం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తర గోవా జిల్లా అర్పోరా ప్రాంతంలోని ప్రసిద్ధ ‘బిర్చ్ బై రొమియో లేన్’ నైట్‌క్లబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో 23 మంది మరణించారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు పర్యాటకులు, మిగిలిన వారు క్లబ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన శనివారం రాత్రి 12:04 గంటల సమయంలో జరిగింది. క్లబ్ కిచెన్ ప్రదేశంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్క క్షణంలో మొత్తం భవనాన్ని మంటలు కలుపుకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆంబులెన్స్‌లు సమయానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 2 గంటలు పట్టింది. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లబ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అనుమానం వ్యక్తం చేస్తూ, క్లబ్ మేనేజ్‌మెంట్‌పై, అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి దర్యాప్తు ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular