Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్Gold Price : తగ్గినట్లే తగ్గి.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే..?

Gold Price : తగ్గినట్లే తగ్గి.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే..?

Gold Price : భారతదేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటి అప్‌డేట్ ప్రకారం, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,460కి చేరగా, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.1,17,750 వద్ద ఉంది. ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.710 పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు మరింత షాకిచ్చాయి – రెండు రోజుల్లో కిలోకు రూ.7,000 వరకు ఎగసి, ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.1,83,000 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.4,000, ఈ రోజు రూ.3,000 చొప్పున భారీ పెరుగుదల నమోదైంది.

భారతదేశంలో బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకాలు, GST, ఆభరణాల తయారీ ఖర్చులు, స్థానిక డిమాండ్-సరఫరా స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. దేశం దాదాపు మొత్తం బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్‌లో ధర పెరిగితే లేదా రూపాయి బలహీనపడితే దేశీయ ధరలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాగే వివాహాలు, పండుగల సీజన్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం కూడా ధరల్ని పైకి నెట్టివేస్తోంది.

RELATED ARTICLES

Most Popular