Tuesday, December 16, 2025
HomeజాతీయంGold price : బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్.. ఎంతంటే..?

Gold price : బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్.. ఎంతంటే..?

Gold price : భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం దేశీయ బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. అయితే బలహీనపడిన అమెరికా డాలర్, అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్న డిమాండ్ కారణంగా పసిడి ధరల పతనం పరిమితంగానే ఉంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఒప్పందాలు ఉదయం 0.14 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,29,892 వద్ద ట్రేడవుతున్నాయి. అదే సమయంలో మార్చి సిల్వర్ కాంట్రాక్టులు మాత్రం 0.74 శాతం లాభంతో కేజీకి రూ.1,79,461 వద్ద చేరాయి.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ఫలితాలపై మార్కెట్ ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలు మిశ్రమ సంకేతాలు ఇవ్వడంతో, కేంద్ర బ్యాంకు రెపో రేటును తగ్గిస్తుందా లేక యథాతథంగా ఉంచుతుందా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు (US CPI Data) ఫెడరల్ రిజర్వ్ తదుపరి వడ్డీ రేటు నిర్ణయాలకు కీలకంగా మారనున్నాయి.

రూపాయి విలువలో కోలుకోలు

కరెన్సీ మార్కెట్‌లో కూడా సానుకూల పరిణామాలు కనిపించాయి. గత మూడు రోజులుగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రూపాయి శుక్రవారం ఉదయం 9 పైసలు బలపడి డాలర్‌తో పోలిస్తే 89.80 వద్ద ప్రారంభమైంది. గురువారం కూడా రూపాయి 26 పైసలు లాభపడి 89.89 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. బుధవారం విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణ, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో రూపాయి తొలిసారిగా 90 మార్కును దాటి 90.15 వద్ద ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular