Government Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్‌డేట్ ఇది. సచివాలయంలో ఎన్నికల సందడి వచ్చేసింది. సచివాలయంలో ఉన్న ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. సచివాలయంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కావడంతో వీటిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 23వ తేదీన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ సెక్రటరియేట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షత సమావేశమైన కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మూడేళ్ల పదవీకాలం ఉంటుంది. ప్రస్తుతం కార్యవర్గం రెండు సార్లు ఎన్నికవడంతో ఆరేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నెల 29వ తేదీతో ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని అప్సా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల షెడ్యూల్
==> 11వ తేదీ జనరల్ బాడీ సమావేశం
==> 12వ తేదీన ఎన్నికల ప్రకటన విడుదల
==> 15 నుంచి 16 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ
==> 17వ తేదీ నామినేషన్ల పరిశీలన.. సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ
==> 23వ తేదీ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికలు. అదే రోజు ఫలితాల ప్రకటన
==> 9 కేటగిరీలకు జరగనున్న ఎన్నికలు

