Monday, December 15, 2025
HomeతెలంగాణGroup-1 notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ ఆరోజే.. పూర్తి వివరాలు ఇవే.!!

Group-1 notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ ఆరోజే.. పూర్తి వివరాలు ఇవే.!!

Group-1 notification : తెలంగాణలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 546 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేసి నియామక పత్రాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా మరో 250 గ్రూప్-1 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం–పది రోజుల్లోనే ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రామకృష్ణారావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కి లేఖ రాయనున్నట్టు అధికార వర్గాల సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్లలో ఇప్పటివరకు 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్ర ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో ప్రకటించారు. అదే సమయంలో “త్వరలోనే మరో 45 నుంచి 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం” అని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారీ ఉద్యోగ నియామకాల డ్రైవ్‌ను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా :

250 గ్రూప్-1 పోస్టులతో పాటు మొత్తం 50 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది.

TSRTCలో 3,200 ఖాళీల భర్తీకి ఆర్టీసీ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు.

దేవాదాయ శాఖలో 1,500 పోస్టులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు–హెల్పర్ల నియామకం.

పోలీసు శాఖలో 12,000 నుంచి 18,000 మంది కానిస్టేబుళ్ల నియామకం.

మిగతా అన్ని శాఖల్లోనూ ఖాళీల వివరాలు ఈ నెల చివరిలోపు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల నుంచి ఖాళీల జాబితా అందిన తరువాత క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది ఆమోదం తీసుకున్న అనంతరం ఆర్థిక శాఖ క్లియరెన్స్‌తో TGPSCతో పాటు ఇతర నియామక మండలులకు అధికారిక లేఖలు పంపనున్నారు.

RELATED ARTICLES

Most Popular