Tuesday, December 16, 2025
Homeరాశి ఫలాలుRasi Phalalu December 16 : నేటి రాశి ఫలాలు 16-12-2025 (మంగళవారం).. ఈరోజు ఏ...

Rasi Phalalu December 16 : నేటి రాశి ఫలాలు 16-12-2025 (మంగళవారం).. ఈరోజు ఏ రాశికి అదృష్టం కలిసివస్తుంటే..?

Rasi Phalalu December 16 : ఈ రోజు గ్రహగతులు 12 రాశులపై భిన్న ప్రభావాలు చూపిస్తున్నాయి. కొన్ని రాశులకు ధనలాభ యోగం, మరికొన్నింటికి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కుటుంబ, వృత్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఏమి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

🔴 మేషం

నూతన కార్యాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా చివరికి సత్ఫలితాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పని పూర్తికావడంతో సంతోషిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

🟠 వృషభం

కుటుంబంలో మార్పు కోరుకుంటారు. కీలక సమాచారం అందుతుంది. ధనలాభ యోగం ఉన్నా మానసిక ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి.

🟡 మిథునం

తోటివారితో విభేదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం మంచిది.

🟢 కర్కాటకం

ప్రయాణాలు అధికమవుతాయి. ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన చెందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

🔵 సింహం

స్థిరాస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. గృహ సంబంధిత పనులపై దృష్టి పెడతారు. ధనలాభంతో పాటు విందు, వినోదాలు ఉంటాయి. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.

🟣 కన్య

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తీరుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు.

⚖️ తుల

గౌరవం పొందే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అసంతృప్తి వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. వృత్తిరీత్యా అప్రమత్తంగా ఉండాలి.

🦂 వృశ్చికం

ధైర్యసాహసాలతో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక లాభాలు ఉన్నాయి.

🏹 ధనుస్సు

వృత్తిలో స్థానచలనం అనుకూలిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలకు చికిత్స అవసరం.

🐐 మకరం

కుటుంబ కలహాలు తగ్గుముఖం పడతాయి. వృథా ప్రయాణాలు అలసటకు కారణమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

🌊 కుంభం

అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి కావచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మనోనిగ్రహం అవసరం. పిల్లలపై శ్రద్ధ వహించాలి.

🐟 మీనం

కుటుంబంలో సంతృప్తి ఉంటుంది. సహనం వహించడం మేలు చేస్తుంది. అనవసర ఖర్చులు రుణభారానికి దారి తీయవచ్చు. దైవదర్శనం లభిస్తుంది.

RELATED ARTICLES

Most Popular