Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Job Notification : పరీక్ష లేదు, నేరుగా ఇంటర్వ్యూతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. విజయవాడ పాస్‌పోర్ట్...

Job Notification : పరీక్ష లేదు, నేరుగా ఇంటర్వ్యూతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. విజయవాడ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్..!!

Job Notification : భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కింద పనిచేస్తున్న విజయవాడ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (RPO) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు ఒక ఖాళీని భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టు ఒప్పంద ప్రాతిపదికపై ఏడాది కాలానికి భర్తీ చేస్తారు మరియు పని తీరు ఆధారంగా రెన్యూవల్ చేసే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16, 2025 వరకు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం పాస్‌పోర్ట్ సేవల్లో పని చేయాలనుకునే యువకులకు మంచి అవకాశంగా మారింది.

పోస్టు : యంగ్ ప్రొఫెషనల్

ఖాళీల సంఖ్య : 01

అర్హతలు : సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. ప్రభుత్వ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.

భాషా నైపుణ్యాలు : హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

పని స్థలం : విజయవాడ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లోనే.

వయోపరిమితి : గరిష్ఠంగా 40 సంవత్సరాలు.

జీతం : నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు.

ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైనవారు పాస్‌పోర్ట్ సేవల్లో సాంకేతిక మరియు పరిపాలనా పనుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ దరఖాస్తును మెయిల్ ద్వారా పంపాలి.

మెయిల్ అడ్రస్ : rpo.vijayawada@mea.gov.in

అధికారిక వెబ్‌సైట్ : https://www.passportindia.gov.in/ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ భర్తీ ప్రక్రియలో అర్హతలు పూర్తిగా గ్రహించుకుని, అవసరమైన డాక్యుమెంట్లతో అప్లై చేయాలని అధికారులు సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లికేషన్ సమర్పించుకోవాలి.

మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు : https://www.mea.gov.in/Images/CPV/YP-vacancy-RPO-vijayawada-2025.pdf

RELATED ARTICLES

Most Popular