Kaushalam Exam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌశలం ప్లాట్‌ఫారమ్ ఏపీ నిరుద్యోగ యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఇది IT, ITES, GCC వంటి రంగాల్లో ఉద్యోగాల కోసం అవసరమైన స్కిల్స్‌ను నేర్పి, పరీక్షల ద్వారా సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ అవకాశాలను సులభతరం చేస్తుంది. కౌశలం అనేది పూర్తిగా ఉచితం మరియు ఏ రకమైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
పరీక్ష ప్యాటర్న్ : పరీక్షలు డిసెంబర్ 2, 2025 నుంచి ప్రారంభం అవుతాయి. ఉదయం 11:00 నుంచి 12:00 వరకు మరియు మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 వరకు రెండు స్లాట్లలో నిర్వహిస్తారు. రోజుకు ఒక సచివాలయంలో ఒకే సారి ఇద్దరు మాత్రమే పరీక్ష రాస్తారు. హెడ్‌సెట్ మరియు కెమెరా సచివాలయంలోనే అందిస్తారు. అసెస్‌మెంట్స్‌లో స్కిల్ టెస్ట్ (45 నిమిషాలు)లో గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ ప్రశ్నలు ఉంటాయి. కమ్యూనికేషన్ టెస్ట్ (15 నిమిషాలు)లో ఇంగ్లీష్ మాట్లాడే 3 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష నియమాలు : పరీక్ష సెంటర్‌లో మాత్రమే రాయాలి, కెమెరా మరియు మైక్రోఫోన్ ఆన్ ఉండాలి, ఒకే ముఖం కనిపించాలి, ట్యాబ్‌లు మార్చితే పరీక్ష క్యాన్సిల్ అవుతుంది.
సిస్టమ్ అవసరాలు : ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, 3 Mbps ఇంటర్నెట్, క్రోమ్/ఎడ్జ్ బ్రౌజర్, వెబ్‌క్యామ్ + మైక్.
పరీక్షలు డిసెంబర్ 2, 2025 నుంచి ప్రారంభం. ప్రొఫైల్‌ను 48 గంటల ముందు పూర్తి చేయాలి, తర్వాత లాక్ అవుతుంది. జాబ్ వచ్చిన తర్వాత ‘I’m Placed’ స్టాటస్‌ను మార్క్ చేసి, కంపెనీ పేరు, డిజైనేషన్, ఆఫర్ లెటర్ అప్‌లోడ్ చేయాలి; 30 రోజులు లాక్ అవుతుంది. రెడీనెస్ సర్వేలో తక్షణమే పని చేయగలరా, ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు, ఎంత త్వరగా పని కావాలి అని అడుగుతారు, ఇది జాబ్ అవకాశాలను పెంచుతుంది.ఇతర సమాచారం: కోర్సు పూర్తి చేస్తే 100 పాయింట్లు, అసెస్‌మెంట్ పూర్తి చేస్తే 150 పాయింట్లు, సర్టిఫికేట్ షేర్ చేయవచ్చు. సహాయం కోసం +91 78297 72255 లేదా kaushalam@ap.gov.inకి సంప్రదించండి.

