liquor Shops : తెలంగాణలో మూడు విడతలుగా జరగబోతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు చుక్కెదురు అయ్యే బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఎన్నికలు జరిగే మండలాల్లో వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిగా మూసివేయనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, జిల్లా కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మూడు దశల డ్రై డే వివరాలు :
- మొదటి విడత – డిసెంబర్ 11 ఎన్నికలు
→ డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి మద్యం షాపులు బంద్
→ డిసెంబర్ 11 ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడే వరకు కొనసాగుతుంది డ్రై డే
- రెండో విడత – డిసెంబర్ 14 ఎన్నికలు
→ డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి మద్యం విక్రయాలు నిషేధం
→ డిసెంబర్ 14 ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే వరకు షాపులు మూసి ఉంటాయి
- మూడో విడత – డిసెంబర్ 17 ఎన్నికలు
→ డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి డ్రై డే అమలు
→ డిసెంబర్ 17 ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించే వరకు మద్యం దుకాణాలు బంద్
ఈ మూడు దశల్లోనూ సంబంధిత మండలాల పరిధిలోని వైన్ షాపులతో పాటు బార్ & రెస్టారెంట్లు, టోడీ షాపులు, క్లబ్లు కూడా పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఏ షాపు తెరిచినా, రహస్యంగా మద్యం అమ్మకాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

