Tuesday, December 16, 2025
HomeసినిమాMeenakshi Chowdhury Marriage : అక్కినేని కోడలిగా మీనాక్షి చౌదరి నిజమేనా..? సుశాంత్‌తో పెళ్లిపై ఆమె...

Meenakshi Chowdhury Marriage : అక్కినేని కోడలిగా మీనాక్షి చౌదరి నిజమేనా..? సుశాంత్‌తో పెళ్లిపై ఆమె ఏం చెప్పిందంటే..?

Meenakshi Chowdhury Marriage : టాలీవుడ్‌లో హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై మీనాక్షి టీమ్ అధికారిక స్పందన వచ్చింది. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఏదైనా అధికారిక ప్రకటన ఉంటే తామే చెబుతామని తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలాంటి పెళ్లి పుకార్లు వచ్చినా అవి కూడా అవాస్తవమేనని తేలింది.

సుశాంత్ – మీనాక్షి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమాతోనే మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. పబ్లిక్‌లో కలిసి కనిపించడం, ఈవెంట్స్‌కి వెళ్లడంతో తరచూ పెళ్లి పుకార్లు వస్తున్నాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షికి మంచి క్రేజ్ వచ్చింది, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

సుశాంత్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జునకు మేనల్లుడు. 2008లో ‘కాళిదాసు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ‘అలా వైకుంఠపురంలో’ సెకండ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు హరియాణకు చెందిన మీనాక్షి చౌదరి మాజీ మిస్ ఇండియా, ప్రముఖ డెంటిస్ట్ కూడా. ప్రస్తుతానికి వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని మీనాక్షి టీమ్ ధృవీకరించింది.

RELATED ARTICLES

Most Popular