Monday, December 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Pension : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికి నెలకు రూ.5 వేల పెన్షన్‌..!!

Pension : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికి నెలకు రూ.5 వేల పెన్షన్‌..!!

Pension : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో భూమిలేని పేద కుటుంబాలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలో రద్దు చేయబడిన లేదా నిలిపివేయబడిన పెన్షన్లను పునరుద్ధరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) 4,929 మంది లబ్ధిదారుల పెన్షన్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వాటిపై పునరాలోచన చేయడానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో 2015 నుంచి 2025 వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలనలో ఈ పెన్షన్లు రద్దు లేదా నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం ఈ జాబితాను సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, రద్దు కారణాలను స్పష్టంగా పేర్కొంది. దీంతో ప్రభావిత లబ్ధిదారులు తమ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు మద్దతు డాక్యుమెంట్లతో సమీప సీఆర్‌డీఏ యూనిట్ ఆఫీసుల్లో లేదా గ్రామసభల సమయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అర్హులైన భూమిలేని పేద కుటుంబాలకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణం కారణంగా జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలకు న్యాయం చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమరావతి పరిధిలో 17 వేలకు పైగా భూమిలేని కుటుంబాలు ఈ పెన్షన్ ప్రయోజనం పొందుతున్నాయి.

అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ, ప్రణాళికాబద్ధమైన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల తదితర జిల్లాల్లోని పలు మండలాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి. రాజధాని నిర్మాణంతో పాటు స్థానికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

RELATED ARTICLES

Most Popular