Monday, December 15, 2025
HomeసినిమాPrabhas in Japan : జపాన్‌లో ప్రభాస్ సందడి.. కొత్త లుక్ అదిరిందిగా..!!

Prabhas in Japan : జపాన్‌లో ప్రభాస్ సందడి.. కొత్త లుక్ అదిరిందిగా..!!

Prabhas in Japan : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన భారీబాంగ్ ఎపిక్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు జపాన్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, అనూహ్య స్పందన పొంది బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం, డిసెంబర్ 12న జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ఇటీవల జపాన్‌లో ల్యాండ్ అయ్యారు.

ప్రభాస్ డిసెంబర్ 5, 6 తేదీల్లో జపాన్‌లో జరిగే స్పెషల్ స్క్రీనింగ్‌లలో పాల్గొన్నాడు. టోక్యోలోని 109 సినిమాస్ కిబా, మారునోఉచి పికాడిల్లీ వంటి ప్రముఖ థియేటర్లలో ఈ ఈవెంట్‌లు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభాస్ తన జపాన్ ఫ్యాన్స్‌తో సమ్మెలనం చేసుకుని, వారితో ముచ్చటించాడు. ఈ క్యూట్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్ షోబు యార్లగడ్డా కూడా ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

‘బాహుబలి’ ఫ్రాంచైజీకి 10 సంవత్సరాల మైలురాయిని గుర్తు చేసుకుని విడుదలైన ఈ రీమాస్టర్డ్ వెర్షన్, 4K ఫార్మాట్‌లో జపాన్‌లో ప్రదర్శించబడుతుంది. దర్శకుడు రాజమౌళి ఒక వీడియో మెసేజ్ ద్వారా జపాన్ ఫ్యాన్స్‌కు మాట్లాడుతూ, “నేను రాను కానీ, మహిష్మతి రాజు బాహుబలి (ప్రభాస్) మీతో ఉంటాడు. ఆయన్ని వెల్‌కమ్ చేయండి” అని పేర్కొన్నారు. ఈ చిత్రం భారతదేశంలో మాత్రమే కాకుండా, అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది.

RELATED ARTICLES

Most Popular