Tuesday, December 16, 2025
HomeసినిమాRajasaab movie teaser : ''రాజాసాబ్'' మూవీ టీజర్ వచ్చేసింది.. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ .....

Rajasaab movie teaser : ”రాజాసాబ్” మూవీ టీజర్ వచ్చేసింది.. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ .. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్..!! (Video)

Rajasaab movie teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమా ”ది రాజాసాబ్” టీజర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హర్రర్-కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్ అభిమానుల అంచనాలను మించి హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో, వింటేజ్ ప్రభాస్ స్వాగ్‌తో అదరగొట్టింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ టీజర్‌లో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. హర్రర్ నేపథ్యంలో సాగే కథలో మారుతి మార్క్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ సీన్స్‌తో టీజర్ సర్వం సమ్మోహనంగా ఉంది. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్‌లో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కనిపిస్తున్నాయి. ఈ టీజర్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ ఔట్‌ఫిట్స్, స్వాగ్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

ప్రభాస్ గత సినిమాలైన బాహుబలి, సలార్లో చూపించిన యాక్షన్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా, ది రాజాసాబ్లో వింటేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ లుక్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సన్నివేశాలతో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular