Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్Ration Cards : ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై అంత కొత్తగా ..!!

Ration Cards : ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై అంత కొత్తగా ..!!

Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రేషన్ కార్డుల స్థానే స్మార్ట్ కార్డులను అమలు చేస్తోంది. ఇకపై రేషన్ దుకాణాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం లబ్ధిదారులకు భారీ ఉపశమనం కలిగించనుంది.

ప్రభుత్వం మరింత కీలకంగా చౌక ధర దుకాణాలను (రేషన్ షాపులు) మినీమాల్స్‌గా మార్చే ప్రయోగాత్మక పథకానికి సిద్ధమైంది. ఈ మినీమాల్స్‌లో రేషన్ బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. ఈ సరుకులను జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ నుంచి సరఫరా చేయనున్నారు.

ఈ పథకాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అమలు చేయనుంది. ఈ ఐదు నగరాల్లో నగరానికి 15 చొప్పున మొత్తం 75 రేషన్ దుకాణాలను ఎంపిక చేసి మినీమాల్స్‌గా మారుస్తారు. ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. అయితే ఈ అదనపు సరుకులపై రాయితీ ఉంటుందా, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనాలా అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

RELATED ARTICLES

Most Popular