Tuesday, December 16, 2025
HomeతెలంగాణRedmi 15C : ధర తక్కువ.. కానీ ఫీచర్స్ ఎక్కువ.. బడ్జెట్ కింగ్ రెడ్‌మీ కొత్త...

Redmi 15C : ధర తక్కువ.. కానీ ఫీచర్స్ ఎక్కువ.. బడ్జెట్ కింగ్ రెడ్‌మీ కొత్త ఫోన్.. జస్ట్ రూ. 12 వేలకే..!!

Redmi 15C : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో మరోసారి దూకుడు చూపించిన షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీ… తక్కువ ధరలో భారీ డిస్‌ప్లే, దుమ్ము లేపే బ్యాటరీ, మంచి కెమెరాతో కూడిన కొత్త 5G ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. గురువారం (డిసెంబర్ 5, 2025) భారత్‌లో అధికారికంగా లాంచ్ అయిన రెడ్‌మీ 15C స్మార్ట్‌ఫోన్… రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

రెడ్‌మీ 15C ధర :

4GB RAM + 128GB స్టోరేజ్ → ₹12,499

6GB RAM + 128GB స్టోరేజ్ → ₹13,999

8GB RAM + 128GB స్టోరేజ్ → ₹15,499

ఈ ఫోన్ డిసెంబర్ 11, 2025 నుంచి అమెజాన్, Mi.com, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

రెడ్‌మీ 15C ప్రధాన ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.9 అంగుళాల HD+ AdaptiveSync LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, TÜV Rheinland లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్

ప్రాసెసర్ : MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ (2.4GHz ఆక్టా-కోర్)

ఆపరేటింగ్ సిస్టమ్ : Android 15 ఆధారిత HyperOS 2.0

రియర్ కెమెరా : 50MP ప్రధాన AI డ్యూయల్ కెమెరా + ఆక్సిలరీ లెన్స్

ఫ్రంట్ కెమెరా : 8MP సెల్ఫీ షూటర్

బ్యాటరీ: 6,000mAh (33W ఫాస్ట్ చార్జింగ్ – 28 నిమిషాల్లో 50% చార్జ్)

ఇతర ఫీచర్లు :

సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5G, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్

రూ.12,499 ప్రారంభ ధరలో 6.9-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 120Hz స్మూత్ స్క్రోలింగ్, 50MP కెమెరాతో పాటు 5G సపోర్ట్ ఇవ్వడం… ఈ సెగ్మెంట్‌లో రెడ్‌మీ 15Cను చాలా ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular