Sankranthi School Holidays Update : భారతదేశమంతటా సంక్రాంతి పండగ సందడి నిండి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఈ పండగను భిన్న పేర్లతో జరుపుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి – పిండి వంటలు, గొబ్బెమ్మలు, పందెంకోళ్లు, అందమైన ముగ్గులు, బసవన్నల హడావిడి పండగకు మరింత రోను తెచ్చాయి. ఉద్యోగాలు, చదువులతో బిజీగా ఉన్న ప్రజలు కూడా సొంత ఊర్లకు చేరుకుని పండగ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2026 జనవరి నెలలో స్కూళ్లకు ఏకంగా 14 రోజుల సెలవులు ఉండనున్నాయి. జనవరి 4 ఆదివారం సెలవుతో ప్రారంభమై, 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25 ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం సెలవులు ఉంటాయి. ఇక ఆదివారాలు (4, 11, 18, 25, 31), రెండో శనివారం కూడా సెలవుగా ఉండటంతో విద్యార్థులకు బంపర్ ఆఫర్‌లా మారింది. సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లకు అదనంగా మరో 3 శనివారాలు సెలవులు జత అయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నెల బంపర్ హాలిడేస్‌తో నిండి ఉంది. జనవరి 1 న్యూ ఇయర్, 3 హజ్రత్ అలీ జయంతి, 16 షబ్ ఎ మెరాజ్ వంటి ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. మొత్తంగా సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ కలిపి నెలలో సగానికి పైగా సెలవులు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.

