Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్SBI Bank Jobs : డిగ్రీ అర్హతతో SBIలో ఉద్యోగం.. పరీక్ష పరీక్షలేకుండానే..!!

SBI Bank Jobs : డిగ్రీ అర్హతతో SBIలో ఉద్యోగం.. పరీక్ష పరీక్షలేకుండానే..!!

SBI Bank Jobs : స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (SCO) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టు పేరు – ఖాళీలు

  1. వీపీ వెల్త్‌(ఎస్‌ఆర్‌ఎం): 506
  2. ఏవీపీ వెల్త్‌ (ఆర్‌ఎం): 206
  3. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌: 284

మొత్తం ఖాళీల సంఖ్య: 996

అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 2025 మే 1వ తేదీ నాటికి 20 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్‌ ద్వారా చేయాలి

దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్‌ 2,2025

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : డిసెంబర్‌ 23,2025

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా

RELATED ARTICLES

Most Popular