Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Scheme : మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త..!!

Scheme : మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త..!!

Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు పలు కేటగిరీల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తొలుత ఘాట్ రోడ్ల సర్వీసులను మినహాయించినప్పటికీ, మహిళల అభ్యర్థనల మేరకు తిరుమల ఘాట్ రోడ్లలో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించారు.

తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నగరాలు-పల్లెటూర్ల మధ్య తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రభుత్వం మరియు ఏపీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం గుర్తింపు కార్డు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు ఈ నిర్ణయం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

త్వరలోనే రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి బస్సు ఎలక్ట్రిక్‌దే అనే విధానంతో పాటు, ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులన్నింటిలోనూ మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీంతో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల మహిళలకూ ఈ పథకం మరింత ప్రయోజనకరంగా మారనుంది.

RELATED ARTICLES

Most Popular