Saturday, January 10, 2026
HomeతెలంగాణSchool Holidays : విద్యార్థులకు శుభవార్త.. వారం రోజులు సెలవులు..!

School Holidays : విద్యార్థులకు శుభవార్త.. వారం రోజులు సెలవులు..!

School Holidays : తెలంగాణల సెలవులు ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుండి సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా, జనవరి 10వ తేదీ రెండో శనివారం రావడంతో విద్యార్థులకు ఒక రోజు ముందే సెలవు దొరకనుంది. దీనికి తోడు 11న ఆదివారం కావడంతో అధికారికంగా సంక్రాంతి సెలవులు ప్రకటించకముందే విద్యార్థులకు వరుసగా రెండు రోజులు విరామం లభిస్తుంది.

ప్రభుత్వ కొత్త కసరత్తు ప్రభుత్వం 14, 15, 16 తేదీలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా అధికారికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో, పాత షెడ్యూల్‌ను సవరిస్తూ జనవరి 12 నుండి 16 వరకు ప్రత్యేక సెలవులను కేటాయించేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల విద్యార్థులకు పండుగ జరుపుకోవడానికి దాదాపు వారం రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది.

స్కూళ్ల పునఃప్రారంభంపై సందిగ్ధత సవరించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు జనవరి 17న (శనివారం) తిరిగి తెరవాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కోసం కాకుండా, శనివారం కూడా సెలవు ఇస్తే నేరుగా 19న సోమవారం నాడు స్కూళ్లు తెరుచుకుంటాయి. దీనిపై ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనతో పాఠశాలలు ఎన్ని రోజులు మూసి ఉంటాయనే విషయంపై స్పష్టత రానుంది.

RELATED ARTICLES

Most Popular