Tuesday, December 16, 2025
HomeతెలంగాణSchool Holidays : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా రెండు రోజులు సెలవులు..!

School Holidays : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా రెండు రోజులు సెలవులు..!

School Holidays : డిసెంబర్ నెలలో పిల్లలకు ఇప్పటికే క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి వంటి పండగల సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. ఇప్పుడు వీటికి తోడు, అనుకోకుండా ఈ నెల 10వ, 11వ తేదీల్లో కూడా సెలవులు రానున్నాయి. తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా మారిన స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు.ఈ నెల 10వ తేదీతో పాటు 11వ తేదీన కూడా పోలింగ్ కేంద్రాలున్న స్కూళ్ల పరిధిలో సెలవులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు పోలింగ్ కేంద్రాలుగా మారుతాయి. ఈ సంప్రదాయం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అందుకే పోలింగ్ రోజుల్లో సంబంధిత స్కూళ్లు, కాలేజీలకు సెలవులు అనివార్యమవుతాయి.

పోలింగ్ జరిగే జిల్లాల్లో 11వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు జీతంతో కూడిన సెలవు (పెయిడ్ హాలిడే) ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ 14వ తేదీన జరగనుంది, అది ఆదివారం కావడంతో మామూలుగానే సెలవు. అంతకు ముందు 13వ తేదీన రెండో శనివారం కూడా ప్రభుత్వ సెలవు దినం కావడంతో స్కూళ్లకు హాలిడే ఉంటుంది. మూడో దశ పోలింగ్ 17వ తేదీన జరగనుంది. దీనికి ముందు 16వ తేదీన కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవులు పిల్లలకు అదనపు విశ్రాంతిని అందిస్తాయి, అయితే ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular