Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్SSC Exam Fee : పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు...

SSC Exam Fee : పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..!!

SSC Exam Fee : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరో గుడ్‌న్యూస్! ఇప్పటికే రెండు సార్లు పొడిగించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (DGE).

డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి శనివారం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. సాధారణ ఫీజు గడువు డిసెంబర్ 9, 2025 వరకు పొడిగించారు. ఇంకా ఫీజు కట్టని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

లేట్ ఫీతో చెల్లింపు గడువులు :

₹50 లేట్ ఫీతో → డిసెంబర్ 12 వరకు

₹200 లేట్ ఫీతో → డిసెంబర్ 15 వరకు

₹500 లేట్ ఫీతో → డిసెంబర్ 18 వరకు

ఫీజు చెల్లింపు www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. పాఠశాలల హెడ్‌మాస్టర్ల ద్వారా కూడా చెల్లించే సౌకర్యం ఉంది.

SSC పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ – 2026

పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు.

మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-1)

మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్

మార్చి 20 – ఇంగ్లీష్

మార్చి 23 – మ్యాథమెటిక్స్

మార్చి 25 – ఫిజికల్ సైన్స్

మార్చి 28 – బయోలాజికల్ సైన్స్

మార్చి 30 – సోషల్ స్టడీస్

మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ (కంపోజిట్ / పేపర్-2)

ఏప్రిల్ 1 – ఒకేషనల్ కోర్సు (OSSC) మెయిన్ లాంగ్వేజ్ & వొకేషనల్ సబ్జెక్ట్స్

ఇప్పటికీ ఫీజు కట్టని విద్యార్థులు డిసెంబర్ 9లోపు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే లేట్ ఫీ కట్టి అయినా చెల్లించే అవకాశం ఉంది కానీ, ఎక్కువ లేట్ ఫీ భారం పడుతుంది.

RELATED ARTICLES

Most Popular