Tuesday, December 16, 2025
Homeస్పోర్ట్స్Team India : టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Team India : టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Team India : భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. డిసెంబర్ 19న విశాఖపట్నంలో జరిగిన డెసైడర్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టు సిరీస్‌లో 0-2తో ఘోర పరాజయం పొందిన భారత్‌కు ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది.

రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు జరిమానా

రాయ్‌పూర్‌లో డిసెంబర్ 17న జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ శిక్ష విధించింది.

ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ధారణ ప్రకారం, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత్ నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం (ప్రతి ఓవర్‌కు 5 శాతం చొప్పున) జరిమానా విధించింది. కెప్టెన్ రాహుల్ తప్పు అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకపోయింది.

RELATED ARTICLES

Most Popular