Tuesday, December 16, 2025
Homeలేటెస్ట్ న్యూస్Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

Telangana High Court : సుప్రీం కోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలో జులై 1, 2 తేదీల్లో సమావేశమై, తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఎంపికైన వారిలో గౌస్‌ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. ఈ కొలీజియంలో జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు.ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు మొత్తం 36 మంది న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తుహిన్‌ కుమార్‌ గెడెలాను న్యాయమూర్తిగా సిఫారసు చేశారు. అలాగే, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పాట్నా తదితర హైకోర్టులకు కూడా న్యాయమూర్తుల నియామకాలకు సిఫారసులు చేశారు.

RELATED ARTICLES

Most Popular