Varanasi Movie Update : సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సృష్టించింది. టైటిల్ లాంచ్ తర్వాత భారతదేశం అంతటా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో మహేష్ బాబు ‘రుద్ర’ అవతారంలో మొదటి లుక్ రివీల్ అయింది. అలాగే రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ బాబు ‘శ్రీరాముని’ పాత్రలో కూడా కనిపిస్తారని.“రామాయణం, మహాభారతం నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్‌లు. మహేష్ మేకప్ చూసిన మొదటి రోజు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆ సీక్వెన్స్‌ను 60 రోజులు షూట్ చేశాం, అది నా ఫిల్మ్‌లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ రాజమౌళి అన్నారు. ఈ రివీల్‌తో అభిమానులు ‘వారణాసి’ని ఒక సాధారణ యాక్షన్ ఎపిక్‌గా కాకుండా, టైమ్-ట్రావెల్ అడ్వెంచర్‌గా చూడటం మొదలుపెట్టారు. ఫిల్మ్ భారతీయ పురాణాలు, హిందూ మిథాలజీని ఆధారంగా చేసుకుని, పురాతన కాలం నుంచి మోడరన్ ఎరా వరకు విస్తరిస్తుందని తెలుస్తోంది.
సినిమా వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం, మహేష్ బాబు ఐదు డిఫరెంట్ లుక్‌లలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రివీల్ అయిన ‘రుద్ర’ (యోధుడి గెటప్), ‘శ్రీరాముని’ (రామాయణం ఇన్‌స్పైర్డ్ సీక్వెన్స్)తో పాటు, మరో మూడు ప్రత్యేక పాత్రలు ఉంటాయట. ఈ సినిమాలో రుద్ర, శ్రీరామడు, శివుడు, శ్రీకృష్ణుడు, ఫ్యూచరిస్టిక్ పునర్జన్మ ఇలా ఈ ఐదు అవతారాల్లో కనిపిస్తాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
‘వారణాసి’ బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఉంటుందని, ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు మాత్రమే 1000 కోట్లు రావచ్చని ట్రేడ్ అనాలిస్టులు చెబుతున్నారు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డ్‌గా నిలుస్తుంది. మహేష్ ఈ ప్రాజెక్ట్‌కు సంవత్సరానికి 50 కోట్లు సాలరీ తీసుకుంటూ, మొత్తం 150-175 కోట్లు పొందవచ్చని టాక్. రాజమౌళి ఈ చిత్రంతో మళ్లీ ఇండియన్ సినిమాను గ్లోబల్‌గా తీసుకెళ్తారని, ఇమాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేస్తారని ధృవీకరించారు.

